![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -171 లో.. కావ్య తన పుట్టింట్లో వర్క్ చేయడం మీడియాలో రావడం అంతే కాకుండా దుగ్గిరాల ఫ్యామిలి గురించి న్యూస్ లో చెడుగా రావడంతో ఇంట్లో అందరు కావ్యని తిడతారు. నేను కష్టపడితే అది మీకు కష్టంగా ఉందా అయితే మీ పరువుకు నష్టం కలిగిందా అని కావ్య అంటుంది.
ఆ తర్వాత అప్పుడే రాజ్ ఇంటికి వచ్చి నువ్వు కష్టం చేస్తున్నావ్ కానీ దానికి ప్రతిఫలంగా డబ్బులు తీసుకుంటున్నావ్ కదా.. ఎందుకు అలా చెప్పుకుంటున్నావ్.. నువ్వు చేసేది కష్టమే కావచ్చు కానీ నువ్వు చేసే పని వల్ల ఈ సమాజం మమ్మల్ని వేలెత్తి చూపిస్తుంది. ఈ దుగ్గిరాల కుటుంబం పరువుపోతుందని రాజ్ అంటాడు. మీరు చెప్పేది నిజం. అంత దూరం అలోచించలేదు. అలా అని నేను చేసే పనిని ఆపలేనని కావ్య అంటుంది. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావ్. నిన్ను ఏదో ఈ ఇంట్లో కష్టపెట్టినట్లు.. నీ తిండి కోసం నువ్వే సంపాదించుకున్నట్లు.. ఈ సమాజం అనుకుంటుందని అపర్ణ అంటుంది. ఈ ఇంటి పెద్దగా చెప్తున్న నీ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం చెయ్యడానికి ఈ కుటుంబం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఏం కావాలి చెప్పమని ఇందిరాదేవి అంటుంది. సారీ అమ్మమ్మ గారు నేను దానికి ఒప్పుకోను. నేను కష్టపడి సంపాదించన డబ్బులు మా ఇంట్లో ఇస్తేనే ఈ ఇంట్లో ఎలా మాట్లాడారో అందరికి తెలుసని కావ్య అంటుంది. ధాన్యలక్ష్మి కూడా కలుగజేసుకొని కావ్యకి నచ్చచెప్పాలని ట్రై చేసినా కావ్య తన మాట వినదు. నా వల్ల ఈ ఇంటి పరువు పోయింది కదా.. పోయిన పరువు నేనే నిలబెడతానని అందరితో కావ్య చెప్పేసి వెళ్లిపోతుంది.
మరొకవైపు కృష్ణమూర్తి సంతోషంగా కనకానికి కిల్లి కొనుక్కొని తీసుకొని వస్తాడు. అది చూసిన కనకం.. ఎన్నడు లేనిది ఈ రోజేంటి.. కిల్లీ తీసుకొచ్చారని కృష్ణమూర్తిని కనకం అడుగుతుంది. నాకు రేపు అన్న భాధ లేదు. ఈ రోజు ప్రశాంతంగా ఉంది. సంతోషంగా ఉన్నాను. ఇదంతా కావ్య వల్లే అని చెప్పుకుంటూ కృష్ణమూర్తి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక వైపు కళ్యాణ్ తన అభిమాన పాఠకురాలు అనామిక ఫోన్ నెంబర్ కనిపెట్టాడానికి నానా తిప్పలు పడుతుంటాడు. అప్పుకి ఫోన్ చేసి హెల్ప్ చేయమని అడుగుతాడు. తెల్లవారి చూసుకుందాం పడుకోమని అప్పు చెప్తుంది. మళ్ళీ కళ్యాణ్ కొన్ని నంబర్స్ ట్రై చేస్తాడు. రాంగ్ నంబర్స్ కి వెళ్తు ఉంటాయి, చివరగా ట్రై చెయ్యగా అది అప్పు ఫోన్ కే చేస్తాడు. కళ్యాణ్ అని తెలియక అప్పు కోప్పడుతుంది. నన్ను డిస్టబ్ చేయకని చెప్పి కళ్యాణ్ తో అప్పు చెప్పేసి పడుకుంటుంది. మరొక వైపు కావ్య, రాజ్ మాట్లాడుకుంటారు. ఏదో పరువు మళ్ళీ తీసుకొస్తానని అందరి ముందు చెప్పావ్ కదా? ఏం చేస్తావని రాజ్ అడుగుతాడు. నేను చెప్పను. అయిన నేను ఇంకా ఏం అనుకోలేదని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |